13వ రోజు ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన


Fri,October 18, 2019 03:03 AM

వననర్తి విద్యావిభాగం/వనపర్తి క్రీడలు/రేవల్లి/పెబ్బేరు రూరల్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నా చౌక్‌లో తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం 13వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు, కళాకారులు వినూత్న నిరసన తెలిపారు. ముందుగా ధర్నాచౌక్ నుంచి డప్పులు, కోలాటాలు కళా ప్రదర్శనలతో రామాలయం వరకు అక్కడి నుంచి రాజీవ్‌చౌరస్తా వరకు కళా ప్రదర్శనలతో వినూత్న ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. యూటీఎఫ్, ఉపాధ్యాయ, బీజేపీ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావాన్ని తెలిపారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధీక్షను చేపట్టారు.

ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మండ్ల రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యంగారి ప్రభాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడి కార్మికులతో చర్చలు జరపాలని అన్నారు. ఈనెల 19న జరిగే రాష్ట్ర బంద్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే శ్రీరంగాపురం మండల కేంద్రంలో గురువారం ఆర్టీసీ కార్మికులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా రేవల్లి మండలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా సీఐటీయూ, కేవీపీఎస్, డీవైఎఫ్‌ఐల నిరసన, దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...