ఓపెన్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం


Fri,October 18, 2019 03:03 AM

వనపర్తి విద్యావిభాగం : ఓపెన్ స్కూల్ సొసైటీ కింద ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభించామని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఓపెన్ ఎస్‌ఎస్‌సీ, ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రెగ్యులర్‌గా విద్యను అభ్యసించలేని యువతీ యువకులు పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసేందుకు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా ఈనెల 31వ తేదీ వరకు అడ్మిషన్ పొందే వీలుందని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పరీక్షల సహాయ సంచాలకుడు మధుకర్, ఓపెన్ కో-ఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్, జీహెచ్‌ఎంల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...