సర్కార్ చిత్తశుద్ధిని శంకించొద్దు


Thu,October 17, 2019 03:01 AM

పెబ్బేరు రూరల్ (శ్రీరంగాపురం) : వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభు త్వం చేతిలో ఉందని వ్యవసాయశా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చె ప్పారు. అన్ని రంగాల్లో వెనుకబడిన వాల్మీకులను ఎస్టీల్లో కలిపేందుకు టీ ఆర్‌ఎస్ సర్కారు ఎంతో కృషి చేస్తోందని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని శంకించొద్దని అన్నారు. శ్రీ రంగాపురం మండలకేంద్రంలో ఏ ర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐక్య వాల్మీకి పోరాట సమితి వ్యవస్థాపకుడు సందు లక్ష్మీనారాయణ విగ్రహాన్ని బుధవారం మంత్రి ఆవిష్కరించారు. స్వంత ఖర్చుతో నిరంజన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయించగా, లక్ష్మీనారాయణ కు టుంబ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీల్లో కలిపితే ఇంతకు ముందు ఎస్టీ జాబితాలో ఉన్న వారికి ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ ప బ్బం గడుపుకుంటున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలోనూ ఇదే జరుగుతోందని, ఆచరణ సా ధ్యం కాని డిమాండ్లను ముందుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదన్నారు.

ఇతర ఉద్యోగులు, విద్యార్థులను రెచ్చగొట్టి విపక్షాలు ప్రభుత్వా న్ని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. జనాభా ప్రాతిపదికనే రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాల న్న నిబంధన ఉందని, 50 వేల మంది కార్మికులను చే ర్చుకుంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆర్టీసీ సంఘాలు వాస్తవాలు గ్రహిం చి సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. బోయల అభివృద్ధి కోసం లక్ష్మీనారాయణ చేసిన సేవలను మంత్రి కొ నియాడారు. వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు గట్టు తిమ్మప్ప, కాళప్ప మాట్లాడుతూ వాల్మీకుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ సతీమణి సువర్ణ, కుమార్తె సాయిప్రియ, సర్పంచ్ వినీలారాణి, ఎంపీపీ గాయత్రి, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, మాజీ జెడ్పీటీసీ కర్రెస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు హరిశంకర్‌నాయు డు, సామాజికవేత్త సత్యంసా

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...