కలెక్టర్‌ను కలిసిన ఎంపీ రాములు


Thu,October 17, 2019 03:01 AM

వనపర్తి,నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును ఉద్దేశించి రూపొందించిన దిశ కార్యక్రమం కింద వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ పోతుగంటి రాములు కలెక్టర్ శ్వేతామొహంతిని కోరారు. బుధవారం ఆయన కలెక్టర్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి గతంలో డీఆర్‌డీఏ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ద్వారా చర్చించేవారన్నారు. అయితే ప్రభుత్వం ఈ కార్యక్రమం పేరును దిశ పేరుతో ప్రస్తుతం అమలు చేస్తున్నదని తెలిపారు. ఆయా పథకాల సమీక్షకు గాను దిశ కార్యక్రమం సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.

జిల్లాలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కార్యక్రమాన్ని బాగా అమలు చేసి మొదటి స్థానంలో నిలిచిన గ్రామానికి తన నిధుల నుంచి ఎల్‌ఈడీ లైట్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. వనపర్తి మండలం ఖాశీంనగర్‌లో చాలా ఏళ్ల నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటున్నారని, వారికి భూములపై హక్కు కల్పించాలని కోరారు. ఈ విషయం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఎంపీ వెంట జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ వామన్ గౌడ్ ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...