సమష్టి కృషితోనే గ్రామాలాభివృద్ధి


Thu,October 17, 2019 03:01 AM

వనపర్తి రూరల్ : మండలంలోని ప్రతి గ్రామపంచాయతీని ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు సమష్టిగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ రాములు తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి ఎంపీ రాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేయాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో నిర్వహించిన అభివృద్ధిపై అధికారులు నివేదికలను చదివి వినిపించారు. పల్లె ప్రగతి కార్యక్రమ వివరాలను వివరించారు. మొదటి సారి సమావేశానికి హాజరైన సందర్భంగా ఎంపీ రాములుకు ఎంపీపీ కిచ్చారెడ్డి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నర్సింహులు, ఎంపీడీవో రఘునాథరెడ్డి, వైస్ ఎంపీపీ సువర్ణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...