క్రీడాకారులకు అభినందనలు


Tue,October 15, 2019 01:45 AM

వనపర్తి విద్యావిభాగం/ఖిల్లాఘణపురం/గోపాల్‌పేట : రాష్ట్రస్థాయి హకీ పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా కేంద్రంలోని స్కాలర్స్ కళాశాల విద్యార్థి హరీశ్ ఎంపిక కావడంతో పీడీ విజయ్‌కుమార్, ప్రిన్సిపల్ మధుసుదన్‌గుప్తా, యాజమాన్య సభ్యులు డాక్టర్ జగదీశ్వర్, సత్యనారాయణరెడ్డి, వరప్రసాదరావులు అభినందించారు. అలాగే ఖిల్లాఘణపురం మండలంలోని సోలీపూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు సంతోశ్, గణేశ్‌లను జీహెచ్‌ఎం విజయ్‌కుమార్, పీఈటీ మన్నెంలు అభినందించారు. అదే విధంగా సెప్టెంబర్ 28వ తేదీన నిర్వహించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ కబడ్డీ టోర్నమెంట్‌లో అంజనేయులు, మౌనికలు ప్రతిభ కనబరిచారని, వారు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు హుజూర్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీల్లో పాల్గొనన్నుట్లు తెలిపారు. గోపాల్‌పేట మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు అనిల్, శ్రీనునాయక్‌లను వ్యాయామ ఉపాధ్యాయుడు జి.సురేందర్‌రెడ్డి, హెచ్‌ఎం రమాకాంత్, ఉపాధ్యాయులు అభినందించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...