స్వీకరించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి


Tue,October 15, 2019 01:45 AM

-కలెక్టర్ శ్వేతామొహంతి
వనపర్తి, నమస్తే తెలంగాణ : ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ శ్వేతామొహంతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఆమె ఛాంబర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయని ఇందులో ప్రధానంగా పింఛన్లు, భూ సమస్యలు వంటి ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా కలెక్టర్ శ్వేతామొహంతి ఫిర్యాదుదారులతో మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని సంబంధిత అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారుల ఇచ్చిన ఫిర్యాదులను క్షుణంగా పరిశీలించి వారికి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...