రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక


Tue,October 15, 2019 01:45 AM

ఖిల్లాఘణపురం : ఈ నెల 3వ తేదీన జిల్లా కేంద్రంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీల్లో మండలంలోని కేజీబీవీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఇన్‌చార్జి హెచ్‌ఎం త్రివేణి, పీఈటీ చిట్టి తెలిపారు. అండర్-14 విభాగంలో 8వ తరగతికి చెందిన ఎం.అనూష ఐదో స్థానంలో, భానుశ్రీ మూడో స్థానంలో నిలిచారని, అండర్-17 విభాగంలో పదో తరగతికి చెందిన అస్మా రెండో స్థానం, కె.లక్ష్మీప్రసన్న మూడో స్థానం, 9వ తరగతికి చెందిన కె.మౌనిక 6వ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. వీరంతా ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొనన్నుట్లు చెప్పారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...