జిల్లా దవాఖానలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ


Tue,October 15, 2019 01:44 AM

వనపర్తి వైద్యం : పట్టణంలో జిల్లా దవాఖానలో డీఎంహెచ్‌వో శ్రీనివాసులు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖాన సిబ్బందితో ఆయన ముందుగానే భర్త్ ప్లాన్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదని అన్నారు. రాష్ట్ర వైద్య కమిషనర్, కలెక్టర్ శ్వేతామొహంతి ప్రశ్నోతరాల మేరకు జిల్లా దవాఖానలోని ప్రసవాల రికార్డులను ఆకస్మీకంగా తనిఖీ చేసి దవాఖానను మరింత అభివృద్ధి దిశ తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ 140 మంది గర్భిణులు చూయించుకోవడానికి రాగా వారిలో 8 మంది పేర్లు మాత్రమే నమోదు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.

భర్త ప్లాన్ విషయంపై చాలా వరకు వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని, మరోసారి ఇలాంటి విషయాలు జరగకుండా సరిచేసుకోవాలని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ హరిశ్‌సాగర్‌కు ఆయన తెలిపారు. గర్భిణులలో 140 మందిలో 63 మంది 9 నెలలు నిండి ప్రసవానికి ఉన్నారు. 33 మందికి ఐరిస్క్ ఉన్నట్లు గుర్తించగా, దీనిలో 8 మంది వివరాలను ఆన్‌లైన్ నమోదు చేయడంతో సరైన సమాచారం రావాడం లేదన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు పల్లవి, వెంకటకృష్ణ, మహేశ్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...