సాఫీగా ప్రయాణాలు


Mon,October 14, 2019 01:28 AM

-98 బస్సులతో రాకపోకలు
-గ్రామాలకూ ఆర్టీసీ బస్సులు
-విధుల్లో చేరిన రెవెన్యూ, కో ఆపరేటివ్ సహకార సంఘం ఉద్యోగులు
-రద్దీగా బస్టాండ్ ప్రాంగణాలు

వనపర్తి విద్యావిభాగం : 9వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వనపర్తి డిపో నుంచి బస్సులను ఎక్కువ మొత్తంలో నడిపి గ్రామీణ ప్రాంతాలలో కూడా సర్వీసులను పునరుద్ధరించారు. కలెక్టర్ శ్వేతామొహంతి వనపర్తి డిపోను శనివారం సాయంత్రం సందర్శించి బస్సుల సర్వీసులపై ఆరాతీసి గ్రామీణ ప్రాంత బస్సులను నడపవలసిందిగా డీఎంను ఆదేశించారు. అందుకు సిబ్బంది కొరత తమకు ఉందని వెల్లడించగా గ్రామీణ ప్రాంతాల సర్వీసుల పునరుద్ధరణ కోసం రెవెన్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని, నగదును తీసుకునేందుకు కో-ఆపరేటివ్ సహాకార సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం ఉద్యోగులు విధుల్లోకి చేరారు. అదేవిధంగా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సహకారంతో 74 ఆర్టీసీ బస్సులు, 24 అద్దె బస్సులు మొత్తం 98 బస్సులను ఆదివారం ఆర్టీసీ యాజమాన్యం నడిపారు. వివిధ రూట్‌లలో సర్వీసులను ఏర్పాటు చేసేందుకు చార్ట్ వద్ద కొంత మందిని, బస్టాండ్‌లో కంట్రోలర్‌గా కొంతమందిని, ఆఫీస్ సిబ్బంది కోసం మరికొంతమందిని విడతల వారిగా కలెక్టర్ కేటాయించారు. మొత్తం రెవెన్యూ సిబ్బంది డిప్యూటీ తాసిల్దార్‌తో పాటు పది మందిని కేటాయించడం జరిగింది. బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు పలు సూచనలు, ప్రయాణికుల రద్దీని బట్టి వాహనాలను పంపేందుకు రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకున్నారు. దీంతో పండుగకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణం కోసం బస్టాండ్ ప్రాంగణంలో బస్సులు ఎక్కేందుకు రాగా బస్టాండ్ ప్రాంగణం, బస్సులో రద్దీ నెలకొంది.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...