రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు..విద్యార్థుల ఎంపిక


Mon,October 14, 2019 01:26 AM

వనపర్తి విద్యావిభాగం : ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు హుజూర్‌నగర్‌లో నిర్వహించను న్న అండర్-17 రాష్ట్రస్థాయి పోటీల కు వనపర్తి బా లికల ఉన్నత పాఠశాల విద్యార్థిని జె.పద్మ ఎంపికైనట్లు హెచ్ ఎం తారాబాయ్, పీఈటీ పద్మ తెలిపా రు. ఆదివారం విద్యార్థినిని అభినందించారు. రా ష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ కనబర్చి పాఠశాల, జిల్లా కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.

సూగూరు గ్రామం నుంచి..
పెబ్బేరు రూరల్ : పెబ్బేరు మండలం సూగూరు గ్రామ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగే కబడ్డీ క్రీడలకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లాలో అండర్-17 బాలికల విభాగంలో రజిత, కోటేశ్వరి ప్రతిభ కనబరిచారు. ఈ నెల 15 నుంచి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరగనున్న పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం వెంకట్‌రెడ్డి, పీఈటీ కురుమయ్య తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...