ఉమ్మడి జిల్లా హాకీ బాలుర జట్టు ఎంపిక


Mon,October 14, 2019 01:26 AM

వనపర్తి క్రీడలు : ఉమ్మడి జిల్లా హాకీ ఎంపికలను స్థానిక బాలకిష్ట్రయ్య క్రీడామైదానంలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ పోటీలలో హాకీ క్రీడాకారులు సూమారు 40 మంది పాల్గొనగా 18 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి వనపర్తి జిల్లా జట్టు హాకీలో బంగారు పతకాలు సాధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో ఆదే స్ఫూర్తితో ఆడి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బీ లక్ష్మయ్య, టీఎన్‌జీవోఎస్ అగ్రీకల్చర్ యూనిట్ అధ్యక్షుడు ఖాజా, హైదరాబాద్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ దేవేందర్, గోల్డ్‌స్మిత్ అధ్యక్షుడు మాధవాచారి, హాకీ మహబూబ్‌నగర్ జిల్లా సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్, బొలమోని కుమార్, హాకీ సభ్యులు వహీద్, కార్తీక్, దయానంద్, గట్టుస్వామి, పృధ్వీరాజు, కిరణ్ పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...