కార్మికుల సమస్యలను పరిష్కరించాలి


Mon,October 14, 2019 01:26 AM

వనపర్తి విద్యావిభాగం : ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పాలిటెక్నిక్ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ మురళీదర్‌గుప్తా అన్నారు. ఆదివారం ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు దీక్ష శిబిరం వద్ద వంటవార్పు నిర్వహించి ప్రధాన రహదారిపైనే భోజనం చేశారు. ఈ సందర్భ ంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రభుత్వమే బేషజాలకు పోయి ఆర్టీసీ కార్మికులను సమ్మెలోకి నెట్టిందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి బలన్మరణానికి పాల్పడి చికిత్స పొందుతు హైదరాబాద్‌లో మృతిచెందాడు. ఆ మరణ వార్త తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్మికుడు సమిష్టిగా కలిసి పోరాడి హక్కులను సాధించుకోవాలని నినాదించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పీఆర్టీయూ, యూటీఎఫ్, డీటీఎఫ్, ఉపాధ్యాయ సంఘాలతో పాటు సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ జన సమితి పలు పార్టీల నేతలు దీక్షలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు, సంఘీభావన్ని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు గోపిగౌడ్, విశ్వనాథ్, స్వామి, రమేశ్, మూర్తి, కృష్ణ, సతీశ్‌యాదవ్, రాములు, సత్యంసాగర్, తెలంగాణ ఖాదర్‌పాష, శోభావతి, తిమ్మప్ప, వెంకటేశ్, గణేశ్, శ్రీనివాస్‌రెడ్డి, జయంత్‌రెడ్డి ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...