మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం గేట్లు


Mon,October 14, 2019 01:25 AM

-సాగర్‌కు 1.11లక్షల క్యూసెక్కులు
నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జూరాల, సుంకేశుల నుంచి భారీ స్థాయిలో నీళ్లు ఇన్ ఫ్లోగా వస్తుండడంతో ఈ సీజన్‌లో శ్రీశైలం గేట్లు ఆరోసారి ఎత్తారు. సమీప కాలంలో ఎన్నడూ లేనట్లుగా ఇలా రోజుల వ్యవధిలోనే గేట్లు తెరుస్తూ నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడం జరుగుతోంది. జూరాల నుంచి 92వేల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 23వేల క్యూసెక్కుల చొప్పున 1.15లక్షల క్యూసెక్కుల నీళ్లు రిజర్వాయర్‌కు వచ్చి చేరుతున్నాయి. దీంతో ప్రాజెక్టు గరిష్ఠ మట్టానికి నీటి నిల్వలు చేరుకొన్నాయి. రిజర్వాయర్ గరిష్ఠ మట్టం 885అడుగులకు గాను 884అడుగులు అలాగే 215టీఎంసీలకు గాను 214టీఎంసీలకు చేరుకొంది. ఆదివారం ప్రాజెక్టు 4గేట్లను 10అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు 1,11,932క్యూసెక్కుల నీళ్లు వెళ్తున్నాయి.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...