కురుమూర్తిలో భక్తుల సందడి


Mon,October 14, 2019 01:25 AM

చిన్నచింతకుంట: మండల పరిధిలోని అమ్మపూర్ గ్రామ సమీపంలో ఏడుకొండల మధ్య కాంచనగుహలో వెలసిన వేంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన కురుమూర్తి స్వామి దర్శనానికి ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కదిలివచ్చారు. స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేసి బారికెడ్లలో నిలిచి ఆపదమొక్కులవాడా గోవింద గోవిందా అంటూ కొండపై ఉన్న ఆలయాలను దర్శించుకున్నారు. కాంచనగుహలో వెలసిన కురుమూర్తిస్వామికి ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. కొండ దిగువభాగంలో స్వామికి దూపదీప నైవేధ్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కురుమూర్తి స్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసిన దుకాణాలలో వివిధ సామగ్రి కొనుగోలు చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా గడుపాడారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

కురుమూర్తిస్వామిని దర్శించుకున్న జడ్జిలు
మండలంలోని అమ్మపూర్ గ్రామ సమీపంలోని సప్తగిరుల మధ్య వెలసిన కురుమూర్తి స్వామిని ఆత్మకూర్ సివిల్ కోర్టు జడ్జి జీవన్ సూరజ్‌సింగ్, డిస్ట్రిక్ట్ స్పెషల్ జడ్జి కే కుష ఆదివారం పౌర్ణమి సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. ఉద్దాల మండపం సమీపంలోకి రాగానే సోనాయిలు, పూర్ణకుంభంతో అర్చకులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయంగా వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బందిని ఆలయ విశిష్టతను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఆలయ సిబ్బందితోపాటు ఎస్సై సంతోశ్, ఏఎస్సై లక్ష్మన్, కోర్టు పోలీసులతోపాటు తదితరులున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...