శివనామస్మరణతో మార్మోగిన శ్రీగిరి


Sun,October 13, 2019 12:24 AM

శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శనివారం వచ్చిన భక్తులతో పుర వీధులన్నీ సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తమ కుటుంబ సమేతంగా మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి 2గంటల సమయం పట్టగా, శీఘ్ర దర్శనానికి గంట సమయం పట్టిందని శ్రీశైల ప్రభ సంపాదకుడు అనీల్‌ కుమార్‌ తెలిపారు. స్వామి వారికి సామూహిక అభిషేకాలతోపాటు బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సాయంత్రం ఉద్యానవనాలు చిన్నారులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటల నుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు.

‘నాణ్యతా ప్రమాణాలు పాటించండి’
శ్రీశైలం దేవస్థానంలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయడమే కాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావు అన్నారు. క్షేత్ర పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ప్రధానంగా పంచమఠాల పునరుద్ధరణ పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా భక్తుల దర్శనానికి సిద్ధం చేయాలని కోరారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...