జూరాలలో 5గేట్లు ఎత్తివేత


Sun,October 13, 2019 12:24 AM

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జూరాలకు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్ట్‌లో 5 గేట్లను ఎత్తి 41,386 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 83,000 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ ఫ్లో 89,712క్యూసెక్కులు నమోదైంది. పవర్‌హౌజ్‌ ద్వారా 44,264 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 6 టర్బైన్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045అడుగుల ఎత్తులో 9.657 టీఎంసీలుండగా ప్రస్తుతం 1044.9 అడుగుల ఎత్తులో 9.542 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 786 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 150క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. వీటితో పాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు భీమా లిఫ్ట్‌-1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్ట్‌లకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 42,324 క్యూసెక్కులు కొనసాగుతుండటంతో అదే స్థాయిలో 42,324 క్యూసెక్కులతో నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాణయణఫుర ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 66,381 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 69,498 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల సామర్థ్యం ఉండగా అదే స్థాయిలో 37.64 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సుంకేసులకు పెరిగిన ఇన్‌ఫ్లో
రాజోళి: సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో శనివారం పెరిగింది. ఎగువ నుంచి 76,900 ఇన్‌ఫ్లో రాగా. 74,100 ఔట్‌ ఫ్లో కొనసాగింది. ఈ నీటి విడుదలకు అధికారులు 14 గేట్లను తెరిచి నీటిని శ్రీశైలం డ్యాంకు విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు 1,050 క్యూసెక్కుల నీటిని వదిలినట్ల్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఆర్డీఎస్‌ ఆనకట్టకు పోటెత్తిన వరద
అయిజ: కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద పోటెంది. ఆర్డీఎస్‌ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆర్డీఎస్‌ ఆనకట్టకు ఇన్‌ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది. వరద నీటితోపాటు ఆర్డీఎస్‌ ఆనకట్ట ఎగువ ప్రాంతం నుంచి రీజనరేట్‌ నీరు సైతం వస్తుండటంతో ఆర్డీఎస్‌ ఆనకట్ట దగ్గర జలకళ సంతరించుకుంది. శనివారం ఆర్డీఎస్‌ ఆనకట్టకు 80,116 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఆనకట్టపై 4.2 అడుగుల మేర ప్రవహిస్తూ 85,116 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 12.2 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆర్డీఎస్‌ డీఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఆర్డీఎస్‌ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 620 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్‌ డీఈఈ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సింధనూరు హెడ్‌రెగ్యులేటర్‌ సమీపంలో 328 క్యూసెక్కులు ఆయకట్టుకు చేరుతున్నట్లు తెలిపారు.

తుంగభద్ర డ్యాంకు వరద
అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద కొనసాగుతోంది. టీబీ డ్యాం ఎగువ భాగాన మోస్తారులో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో 3 స్పిల్‌ వే గేట్లను అడుగు మేర ఎత్తి 4,611 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం టీబీ జలాశయానికి ఇన్‌ఫ్లో 16,771 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ ఫ్లో 16,471 క్యూసెక్కులు నమోదైంది. 3 స్పిల్‌ వేట్ల ద్వారా 4,611 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు టీబీ బోర్డు సెక్షన్‌ అధికారి విశ్వనాథ తెలిపారు. 11,860 క్యూసెక్కుల నీటిని ఏపీ, కర్ణాటక కాల్వలకు విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీలు నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...