80 బస్సులు నడిపిన ఆర్టీసీ


Sun,October 13, 2019 12:24 AM

వనపర్తి విద్యావిభాగం: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా శనివారం యధావిధిగా 80 బస్సులను నడిచాయి. పండుగకు వచ్చిన ప్రజలు తిరిగి ప్రయాణం అయ్యేందుకు బస్టాండ్‌కు రాగా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. తాత్కాలిక కార్మికులతో ప్రధాన రూట్‌లలో బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతున్నారు. మొత్తం 80 బస్సులకుగాను అందులో 56 ఆర్టీసీ, 24 అద్దె బస్సులను నడిపి రోజురోజుకు ఆదాయాన్ని గడిస్తు బస్సుల సంఖ్యను కూడా ఏ రోజుకు ఆ రోజు పెంచుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే రూ.4లక్షల25వేల ఆదాయాన్ని గడించినట్లు డీఎం దేవదాన తెలిపారు. ఆర్టీసీ ప్రాంగణంలో సెక్యురిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రయాణికుల రద్దీకనుగుణంగా ఆయా రూట్‌లలో బస్సులను పంపించేలా డీఎం ఏర్పాట్లను చేశారు. సాధారణ పరిస్థితులలో మాదిరిగానే ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించేలా ఉంది. నేటి నుంచి గ్రామీణ ప్రాంతాలలో సర్వీసులను పునరుద్దరించేందుకోసం కలెక్టర్‌ శ్వేతామొహంతి సూచనల మేరకు గ్రామీణ స్థాయి పరిపాలన సిబ్బంది సహకారంతో అన్ని బస్సులను నడిపేలా చర్యలు చేపట్టనున్నట్లు డీఎం తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...