యథావిధిగా ప్రయాణాలు


Wed,October 9, 2019 11:52 PM

-70 బస్సులతో రాకపోకలు
-నేటి నుంచి నైట్‌హాల్ట్ బస్సుల పునరుద్ధరణ
-అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు
-తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో సాఫీ

వనపర్తి ప్రతినిధి,నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మే ఫలితంగా తాత్కాలిక డ్రైవర్లు..కండక్టర్ల ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. దీంతో ప్రభుత్వం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సజావుగా జరిగేలా చర్యలు చేపట్టింది. రవాణా, పోలీసు శాఖల సమన్వయంతో యథావిధిగా ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. వనపర్తి ఆర్టీసీ డిపో పరిధిలో నడిచే బస్సులను యథావిధిగా నడిపించేందుకు ప్రత్యామ్నాయ సిబ్బందితో ఎంతో పటిష్టంగా బస్సులను నడిపిస్తున్నారు. డిపో పరిధిలో 85 ఆర్టీసీ బస్సులుంటే, మరో 25 ఆర్టీసీ హైర్ బస్సులున్నాయి. తాత్కాలికంగా అవసరమైన డ్రైవర్లు, కండక్టర్ల పూర్తిస్థాయిలో నియమించి అన్ని బస్సులను నడిపించేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటి వరకు ప్రధాన రూట్లలో బస్సులను నడిపించగా మారుమూల గ్రామాలకు బస్సులు వెళ్లలేదు.

70 బస్సులతో ప్రయాణాలు
బుధవారం వనపర్తి డిపో నుంచి 70 బస్సులను నడిపించారు. వీటిలో ఆర్టీసీ బస్సులు, హైర్ బస్సులు, మరికొన్ని ప్రైవేట్ బస్సులున్నాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, కర్నూల్, ఆత్మకూరు, కొల్లాపూర్, గద్వాల ప్రధాన మార్గాల్లో ఈ బస్సులను నడిపించారు. దసరా పండుగను ముగించుకున్న ప్రజలు తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు. ఈ మేరకు బస్టాండ్లు...బస్సులు రద్దీగా కనిపించాయి. సమ్మె ప్రారంభమైన నాటి నుంచి మంగళవారం 8వ తేది వరకు దాదాపు 50 వేల కిలోమీటర్లమేర బస్సులను నడిపించారు. 100 మందిని డ్రైవర్లు, మరో వందమంది కండక్టర్లను తీసుకున్నారు. వీరికి ఇప్పటి వరకు అధికారులు రూ.4 లక్షల తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు చెల్లించారు.

నేటి నుంచి నైట్‌హాల్ట్ బస్సులు..
ఇప్పటి వరకు ప్రధాన మార్గాలపైనే దృష్టి పెట్టిన అధికారులు ఇక మారుమూల గ్రామాలు, నైట్‌హాల్ట్ వెళ్లే మార్గాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. పైస్థాయి అధికారుల ఆదేశాల మేరకు అన్ని మారుమూల గ్రామాలకు సైతం ట్రాఫిక్ నిబంధనలు లేకుండా బస్సులను నడపాలని సిద్ధమయ్యారు. డిపో పరిధిలో ఉన్న బస్సులను పూర్తి స్థాయిలో నడిపించేందుకు గురువారం నుంచి కార్యాచరణ చేపట్టనున్నారు. అధికారుల నిర్ణయంతో మారుమూల గ్రామాలకు సైతం బస్సులు రాబోతున్నాయి. సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి నైట్ హాల్ట్ బస్సులు నడవలేదు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...