టీఆర్‌ఎస్‌లోకి స్వచ్ఛంద వలసలు


Wed,October 9, 2019 11:50 PM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఆంధ్రా పార్టీలను వీడి స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దమందడి మండలంలోని అమ్మపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్ రమేశ్ ఆధ్వర్యంలో 100 మంది నాయకులు మంత్రి సమక్షంలో ఆయన నివాస గృహంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నదన్నారు. కేసీఆర్ కిట్‌తో మొదలుకొని కల్యాణలక్ష్మి వరకు ప్రతి పథకం అనుక్షణం ప్రజల్లో కదలాడుతున్న పథకాలని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ జరగని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపెడుతున్నదన్నారు. మనస్సు చంపుకొని కాంగ్రెస్‌లో పనిచేయలేకపోతున్నామని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని పార్టీలో చేరిన వారు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుమార్, సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, అమ్మపల్లి గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...