అధికారికంగా వాల్మీకి జయంతి


Wed,October 9, 2019 11:50 PM

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వాల్మీకి మహర్షి జయంతిని ప్రభుత్వమే అ ధికారికంగా నిర్వహిస్తుందని వ్యవసాయ శా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. వనపర్తిలో రూ.25 లక్షలతో వాల్మీకి భ వనం, వాల్మీకి విగ్రహావిష్కరణ చేపట్టేందు కు నిర్ణయించామన్నారు. స్థల ఎంపిక తరువాత పనులు మొదలుపెడతామని చెప్పా రు. మంగళవారం మంత్రి తన నివాసగృహంలో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేసే విగ్రహాలను ప్రతిష్ఠించుకోవాల్సి ఉం టుందన్నారు. అందుకనుగుణంగా ప్రభు త్వ స్థలంలోనే వాల్మీకి కమ్యూనిటీ భవనం, విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. త్వరలోనే కలెక్టర్ స్థలాన్ని పరిశీలన చే యనున్నట్లు చెప్పారు. స్థలాన్ని గుర్తించిన తక్షణమే విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని ప్రకటించారు. వాల్మీకి భవన నిర్మాణం కోసం తన తొలి విడుత నిధుల నుంచి రూ.10 ల క్షలను వినియోగిస్తానని మంత్రి ప్రకటించారు.

కాగా, ఉమ్మడి జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, వాల్మీకి మహర్షిల తొలి విగ్రహాలను అడ్డాకుల, చెన్నారం, చం దాపురం గ్రామాల్లో ఏర్పాటు చేయించానని గుర్తు చేశారు. మహర్షుల విగ్రహాలు ప్రజలు ఆరాధించేలా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మహర్షుల జ యంతిలో పాల్గొనని వారంతా నేడు అసలు విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సముచితం కాదన్నారు. ఈ నెల 13న అధికారికంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. సమావేశం లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, ఉంగ్లం తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...