రైళ్ల దారి మళ్లింపు..


Wed,October 9, 2019 11:50 PM

ఇక కాచిగూడ వైపు నుంచి గద్వాల, కర్నూల్ మీదుగా తిరుపతి, బెంగుళూరు వైపునకు వెళ్లాల్సిన పలు రైళ్లను వికారాబాద్, రాయిచూరు, గుంతకల్ మీదుగా దారి మళ్లించారు. తిరుపతి, చిత్తూరు, బెంగుళూరు వైపు నుంచి కాచిగూడ రావాల్సి రైళ్లను గుంతకల్, రాయిచూర్, వికారాబాద్ మీదుగా దారి మళ్లించారు. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ స్టేషన్ వరకు వచ్చిన కాచిగూడ - గుంటూరు ప్యాసింజర్ రైలు, కాచిగూడ - కర్నూలు హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మహబూబ్‌నగర్ వరకు నడిపి తిరిగి కాచిగూడ తిప్పి పంపించారు. ఇక కర్నూల్ - కాచిగూడ తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ దేవరకద్ర రైల్వేస్టేషన్‌లోనే ఆపేశారు. రాయిచూర్ - కాచిగూడ డెమోను రైలును గద్వాల స్టేషన్‌లో నిలిపేశారు. ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ ముగించుకొని గమ్య స్థానాలకు చేరుకునే క్రమంలో చిన్న పిల్లలతో తల్లులు అవస్థలు పడ్డారు. రవాణా శాఖ, పోలీసులు సత్వరం స్పందించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం వల్ల కొద్ది మేర ఇబ్బందులు తగ్గాయి. సాయంత్ర రైల్వే డీఆర్‌ఎం సీతారాంప్రసాద్ పరిస్థితిని పరిశీలించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...