పట్టాలు తప్పిన బీటీఎం


Wed,October 9, 2019 11:50 PM

మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ స్టేషన్ వద్ద బ్లాస్ట్ క్లీనింగ్ మెషిన్ (బీటీఎం) రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దారి మళ్లించారు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఘటన చోటు చేసుకున్నది. ఆ తర్వాత కాచిగూడ - కర్నూల్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పలు రైళ్లను సమీప స్టేషన్లలో ఆపేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. మన్యంకొండ వద్దకు చేరుకున్న ఆక్సిడెంట్ రిలీఫ్ వెహికిల్ (ప్రత్యేక రైలు) సిబ్బంది పట్టాలు తప్పిన బీటీఎంను ట్రాక్‌పైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బీటీఎంను ట్రాక్‌పైకి తీసుకువచ్చేందుకు అర్ధరాత్రి వరక సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కర్నూల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలును మన్యంకొండ వద్ద ఆపేశారు. రవాణా, పోలీసు శాఖాధికారులు 10 ప్రత్యేక బస్సుల ద్వారా పలువురు ప్రయాణీకులను హైదరాబాద్ తరలించారు. మిగతా వారికి మ్యాక్సి క్యాబ్ ఏర్పాటు చేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...