రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Wed,October 9, 2019 11:49 PM

పాన్‌గల్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మాజీ మంత్రి జూపల్లి కృష్ఱారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఎంజీకేఎల్‌ఐ డీ-8 నుంచి మండలంలోని మాధవరావుపల్లిలో బొమ్మన చెరువుకు, పాన్‌గల్‌లోని పొల్కిచెరువుకు నీటిని విడుదల చేసేందుకు మంగళవారం రైతులతో కలిసి వేర్వేరుగా హాజరై గంగకు పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఎకరాకూ సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే సర్కారు లక్ష్యమని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కాల్వలను త్వరితగతిన పూర్తి చేసి పంట పొలాలకు సాగునీటిని అందిస్తామన్నారు. అనంతరం కార్యకర్తలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ రవి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ భాస్కర్‌యాదవ్, నాయకులు వెంకటయ్యనాయుడు, గాల్‌రెడ్డి, రాముయాదవ్, సుధాకర్‌యాదవ్, బ్రహ్మం, బాలరాజు, రాంచందర్, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...