మూడో రోజు 79 బస్సులు


Tue,October 8, 2019 03:40 AM

-రోజురోజుకూ పెరుగుతున్న బస్సుల సంఖ్య
-ఇబ్బందుల్లేకుండా చూస్తున్న అధికారులు
-కార్మికులను తొలగించినట్లు అధికారికంగా మెసేజ్‌లు : డీఎం దేవదానం

వనపర్తి విద్యావిభాగం : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మూడో రోజు ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రద్దీని బట్టి బస్సులను నడుపుతున్నారు. సోమవారం వనపర్తి డిపో నుంచి ఆర్టీసీ బస్సులు 55, అద్దె బస్సులు 24 నడిపారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు స్థానికంగా రోజువారిగా పాఠశాలలకు పిల్లలను తీసుకువచ్చే విధంగా వెళ్తున్న బస్సుల రూట్‌లలోనే బస్సులను నడుపుకోవాలని ఆర్టీవో అధికారులు ఆదేశించారు. ఆదివారం కేవలం 75 బస్సులు ఆర్టీసీ నడుపగా సోమవారం 79 బస్సులు నడిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రయాణికులు రద్దీగా ఉండే ప్రదేశాలకు వాహనాలు నడుపుతున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగడంతో ప్రైవేట్ జీపులు, తుపానుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతుంది. ఏదిఏమైన రెగ్యూలర్ షెడ్యుల్ ప్రకారం వాహనాలు నడిపితే సమ్మె ప్రభావం ఏమాత్రం ఉండదు. పండుగ పూట బందువుల ఇండ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అటంకాలు కలుగకుండా ఆర్టీసీ, ఆర్టీవో యాజమాన్యాలు చర్యలు చేపడుతుంది. అదేవిధంగా డీఎస్పీ, సీఐలు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పర్యవేక్షణలో బస్టాండ్, డిపో ముందు పటిష్ఠ బందోబస్త్ నిర్వహిస్తున్నారు. కాగా విధులకు గైర్హాజరైన కార్మికులను తొలగిస్తున్నట్లు అధికారికంగా మెసేజ్‌లను ప్రభుత్వం డిఎంలకు పంపినట్లు వనపర్తి డీఎం దేవదానం తెలిపారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...