నల్లచెరువును పూర్తి స్థాయిలో నింపాలి


Tue,October 8, 2019 03:38 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న నల్లచెరువు(మినీ ట్యాంక్ బండ్)ను పూర్తి స్థాయిలో నీటితో నింపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. 17 రోజులుగా వస్తున్న నీటిని సోమవారం టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో వర్షాలు కురిస్తేనే నల్లచెరువుకు నీళ్లు వచ్చేవని, ప్రసుత్తం కృష్ణమ్మ జలసవ్వడులను నల్లచెరువుకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. చెరువును పూర్తి స్థాయిలో నింపిన తర్వాత నల్లచెరువుకు అభివృద్ధీకరణ పనులు పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టుయాదవ్, మాజీ కౌన్సిలర్ పాకనాటి కృష్ణయ్య, నాయకులు తదితరులు ఉన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...