పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం


Tue,October 8, 2019 03:38 AM

-దెబ్బతిన్న సుమారు వెయ్యి ఎకరాల మొక్కజొన్న : ఎమ్మెల్యే బీరం
చిన్నంబావి : పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న పంటను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. చిన్నంబావి మండలంలోని అయ్యవారి పల్లి, చెల్లెపాడు, కొప్పునూర్, పెద్దమారూర్, వెల్టూర్, చిన్నమారూర్ గ్రామలకు చెందిన సుమారు 1000 ఎకరాల మొక్కజొన్న పంట నేలకొరిగి దెబ్బతినడంతో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షానికి పాడుకావడం చాలా బాధాకరమన్నారు.

నష్టపోయిన రైతులు ఎవరు కూడా దిగాలు చెందొద్దని, ఎంతమేర పంట నష్టం జరిగిందో అధికారులతో నివేదిక తెప్పించుకొని ప్రభుత్వం తరఫున సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నష్టపోయిన పంట గురించి మంత్రి నిరంజన్‌రెడ్డికి ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సమాచారమందించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో వెంటనే నివేదిక అందించాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖల అదికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ, అయ్యవారిపల్లి సర్పంచ్ రామస్వామి, తాసిల్దార్ ఫర్కుందా తాన్సిమ్, మండల వ్యవసాయ శాఖ అధికారి డాకేశ్వర్, ఏఈవో యుగేంధర్, నాయకులు చిదంబర్ రెడ్డి, కిరణ్ కుమార్, మధు, చిన్నారెడ్డి ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...