పెరిగిన రాకపోకలు


Mon,October 7, 2019 03:07 AM

-రెండో రోజు 83 బస్సులు
-యథావిధిగా ప్రయాణాలు
-డిపో ముందు పోలీసుల నిఘా
-మొదటి రోజు రూ.2లక్షలకు పైగా ఆదాయం
-గ్రామీణ స్థాయిలో సర్వీసుల పునరుద్ధరణకు ప్రయత్నం

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/వనపర్తి విద్యావిభాగం : రెండో ఆదివారం ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగించడంతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా బస్సులను నడుపకతప్పలేదు. దసరా సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బ ందులు కలుగకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యామ్నా య మార్గాల ద్వారా బస్సులను నడిపిస్తున్నది. విద్యాలయాలకు సెలవులుండటం, దసరా ఉన్నందున ప్రయాణికుల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభు త్వం కార్మిక సంఘాలకు సూచించింది. అయినప్పటికీ ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ సమ్మెకు వెళ్లడంతో ప్రభుత్వం కూడా ప్ర త్యేక మార్గాలను వెతకాల్సి వచ్చింది. మొదటి రోజు 60 బస్సులను తాత్కాలిక డ్రైవర్లతో నడిపించిన అధికారులు, రెండోరో జు మరింతగా చొరవ తీసుకున్నారు. మొత్తం 83 బస్సులను నడిపించింది. ఆర్టీవో, పోలీస్, ఆర్టీసీ సంయుక్త ఆధ్వర్యంలో 24 అద్దె బస్సులు, 51 ప్రభుత్వ బస్సులు, 8 పాఠశాలల బస్సులను నడిపించారు. హైదరాబాద్, కర్నూల్, కొత్తకోట-మహబూబ్‌నగర్, ఖిల్లాఘణపురం-మహబూబ్‌నగర్, ఆత్మకూరు, కేతేపల్లి-కొల్లాపూర్, గద్వాల మార్గాల్లో బస్సులను నడిపించారు. కాగా, ప్రైవేట్ స్కూలు బస్సులను మాత్రం ఖిల్లాఘణఫురం రూట్‌లోనే ఎక్కువగా నడిపించారు. ఇదిలా ఉండగా, రవాణా, పోలీసు శాఖల సమన్వయంతో తాత్కాలిక డ్రైవర్లు, కండెక్టర్ల ద్వారా బస్సులను నడిపిస్తున్నారు.

పోలీసుల బందోబస్తు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పోలీసులు బస్ డిపో ముం దు భద్రత పెంచారు. పగలు, రాత్రిళ్లు కూడా పోలీసుల నిఘా కొనసాగుతున్నది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా నడిపిస్తున్న బస్సులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాత్కాలిక డ్రైవర్ల ఎంపికలోనూ రవాణా శాఖ అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. తాత్కాలికంగా బస్సులను నడిపించేందుకు అత్యధిక మంది యువకులు రావడంతో వారిలో మెరుగ్గా ఉన్నవారిని మాత్రమే డ్రైవింగ్‌కు ఎంపిక చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బస్సులు బయటకు వెళ్లినప్పటి నుంచి డిపోకు తిరిగి వచ్చే దాకా పోలీసులు ప్రత్యేక నిఘాను కొనసాగిస్తున్నారు. రెండు లక్షలకు పైగా ఆదాయం శనివారం 60 బస్సుల్లో 34 ఆర్టీసీ బస్సులను నడిపారు. ఇందుకు గాను ఆర్టీసీ బస్సుల నుంచి రూ.2,14,718 ఆదాయాన్ని ఆర్టీసీ గడిచింది.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...