అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు


Mon,October 7, 2019 03:04 AM

ఖిల్లాఘణపురం : తెలంగాణ సంస్కృతికి ప్రతిక బతుకమ్మ పండుగ అని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మల్కినియాన్‌పల్లి, కోతులకుంటతండా సర్పంచులు శాంత, శ్రీనుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు జెడ్పీటీసీ సామ్యనాయక్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ముందుగా మహిళలు బ తుకమ్మలతో ర్యాలీగా ఆయా గ్రామాల ఆలయాల వద్దకు తీసుకువచ్చి బతుకమ్మ ఆడారు. మహిళతో పాటు జెడ్పీ చైర్మన్ కూడా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది బతుకమ్మ ఉత్సవాలకు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో ఉత్సాహంగా ప్రతి రోజు బతుకమ్మలు ఆడుతూ మహిళలు, గ్రామస్తులు సంతోషంగా గడుపుతున్నారని అన్నారు.

సోలీపూర్‌లో..
మండలంలోని సోలీపూర్ గ్రామంలో ఆదివారం సర్పంచ్ పద్మశ్రీ ఆధ్వర్య ంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా చా మంతి, గునుగు, చామంతి తదితర పూలతో త యారు చేసిన బతుకమ్మలను నెత్తిన పెట్టుకొని ఊ రేగించి బతుకమ్మ పాటలకు బొడ్డెమ్మ ఆడారు. అనంతరం గ్రామ చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

గోపాల్‌పేటలో
గోపాల్‌పేట : మండలంలోని ఏదుల గ్రామంలో సర్పంచ్ నాగమణి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మహిళలు ఇంటింటా బతుకమ్మలను వివిధ రకా ల పూలతో అలంకరించి గ్రామంలో ప్రదర్శనగా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అంగన్‌వాడీలు, ఆశలు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

పెబ్బేరులో..
పెబ్బేరు : తొమ్మిది రోజుల పాటు వివిధ పేర్లతో గౌరమ్మను పూజించిన మహిళలు చివరి రోజున సద్దుల బతుకమ్మగా పూజించారు. ఆదివారం మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ జ్యోతి నేతృత్వంలో చేపట్టిన సద్దుల బతుకమ్మ వేడుకలకు జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ శైలజలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొల్లాపూర్ చౌరస్తా నుంచి సుభాశ్ చంద్రబోస్ చౌరస్తా వరకు మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని భారీగా ర్యాలీతో బతుకమ్మ శోభయాత్ర నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలతో మహిళలు ఆడిపాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పద్మ, మాజీ సర్పంచ్ సుశీల, వివిధ సంఘాల మహిళలు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...