బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే ఆల


Mon,October 7, 2019 03:04 AM

మదనాపురం : మండలంలోని దుప్పల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త వెంకట్రాములు యాదవ్ తండ్రి శానంది శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దుప్పల్లి గ్రామానికి ఆదివారం విచ్చేసి శానంది మృతదేహంపై పూలమాల ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం శానంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన పాషా అనే టీఆర్‌ఎస్ కార్యకర్త రెండు రోజుల కిందట మృతిచెందడంతో పాషా నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, జెడ్పీటీసీ కృష్ణయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్‌నారాయణ, కో-ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాష, టీఆర్‌ఎస్ నాయకులు సత్యనారాయణగౌడ్, నాగన్న యాదవ్, మహదేవన్‌గౌడ్, వెంకటన్న, రాజవర్దన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...