ఆర్టీసీతోనే మలిదశ ఉద్యమం


Mon,October 7, 2019 03:03 AM

వనపర్తి విద్యావిభాగం : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం రెండో రోజుకు చేరింది. కలెక్టరేట్ ముందున్న ధర్నాచౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్ధతు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమం ఆర్టీసీతోనే ప్రారంభమైందని ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమ్మె సైరన్‌కు సిద్ధం కానున్నాయని వారు అన్నారు. ఆర్థికపరమైన అంశాలను చర్చలు జరిపి పరిష్కరించుకునే వీలున్నప్పటికీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు గోపిగౌడ్, జేవీ స్వామి, ఎంఎఫ్ యాదయ్య, విశ్వనాథం, ఆయా పార్టీల నాయకులు జబ్బార్, శంకర్‌ప్రసాద్, శ్రీనివాసులు, కృష్ణ, సత్యంసాగర్, ఆశోక్, పుట్ట ఆంజనేయులు, రాజు, యోసెపు, వేణుగోపాల్, ఉపాధ్యాయ సంఘం నేతలు మహిపాల్‌రెడ్డి, చెన్నరాములు, రవిప్రసాద్‌గౌడ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...