నేటి తరానికి చరిత్రను పరిచయం చేయాలి


Mon,October 7, 2019 03:03 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : మన ప్రాంత చరిత్రను డాక్యుమెంటరీల ద్వారా నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దర్శకుడు వీజే సాగర్ రూపొందించిన ఖిల్లాఘణపు రం చరిత్ర డాక్యుమెంటరీని మంత్రి ఆదివారం తన నివాస గృహంలో ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చరిత్ర ప్రసిద్ధమైన గ్రామాలు మన ప్రాంతంలో ఎన్నో ఉన్నాయని, అనుకున్నంతగా వాటికి ఇప్పటికీ గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి గ్రామాలు, కట్టడాల చరిత్ర విలువైన విషయాల సమాహారంతో డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు రావాలన్నారు. కాకతీయుల కాలం నాటికి ప్రసిద్ధ సైనిక స్థావరంగా ఉన్న ఖిల్లాఘణపురం చరిత్రను చక్కటి డాక్యుమెంటరీగా చిత్రీకరించడం అభినందనీయమన్నారు. పురాతన కాలంలో ఖిల్లాకు ఘన చరిత్ర ఉండేదని, ఆ చరిత్రలో కాకతీయుల కట్టడాలు, మబ్బు చెలిమె, ఫిరంగి, చెరువులు, దొంగలబాట, రహస్య బాటలు తదితర వాటిని క్రోడీకరించడం సంతోషంగా ఉందన్నారు. తెరపై చూపిస్తే ప్రజలకు చరిత్ర గురించి సులువుగా అర్థమవుతుందన్నారు. పాన్‌గల్ ఖిల్లా చరిత్రను కూడా చిత్రీకరించాలని, అందుకు కావాల్సిన అన్ని వనరులను సమకూర్చుతామన్నారు. అనంతరం దర్శకుడిని సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్, ఇబ్రహీం, శ్యాంసుందర్, ఎడిటర్ పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...