దుర్గామాత ఆశీస్సులతో విజయం కలగాలి


Mon,October 7, 2019 03:03 AM

వనపర్తి విద్యావిభాగం : దసరా పండుగను పురస్కరించుకొని పోలీసులకందరికీ విజయం వరించాలని ఎస్పీ అపూర్వరావు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో ఆయుధాలు, వాహనాలకు ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఆయుధాలు, వాహనాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఉండాలని రావణ మంత్రోచ్ఛరణలతో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగం దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పేరు, ప్రతిష్ఠలు తెచ్చుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సాయుధ దళాధిపతి రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ వెంకట్, శ్రీనివాసులు, సికిందర్, వాహన చోదకులు తదితరులు ఉన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...