రామ రామ రామ ఉయ్యాలో..


Sun,October 6, 2019 02:04 AM

-జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు
-వనపర్తిలో రెవెన్యూ, వైద్య శాఖ ఆధ్వర్యంలో వేడుకలు
-ఆడిపాడిన అధికారులు
-ఆత్మకూరులో బతుకమ్మల సందడి

వనపర్తి సాంస్కృతికం : బతుకమ్మను ప్రకృతి ఆరాధించే పండుగగా తెలంగాణ ప్రజలు పిలుస్తారని జేసీ డీ వేణుగోపాల్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమానికి జేసీ ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలు బాగా పూసే, జలవనరులు సమృద్ధిగా ఉండే కాలంలో బతుకమ్మ పండుగ వస్తుందని, అందుకే దీనిని పూల పం డుగ అని అంటారని గుర్తు చేశారు. పూలు వికసించినట్లు మీ జీవితాలు కూడా గొప్పగా వికసించాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. తంగేడు, బంతి, గునుగు వంటి వివిధ రకాల పూలతో బ తుకమ్మలను పేర్చి రెవెన్యూ శాఖ కార్యాలయానికి తీసుకువచ్చి బతుకమ్మ ఆడారు. జిల్లా వైద్య సిబ్బంది, మహిళా ఉద్యోగులు ప్రభుత్వ దవాఖా న ఆవరణలో ఉత్సాహంగా బతుకమ్మ ఆడి సం దడి చేశారు. డాక్టర్ ఎజాజ్‌ఖాన్, వైద్య సిబ్బంది ప్రణిత, నారాయణమ్మ, శానిటేషన్ సిబ్బంది, డీఆర్‌వో వెంకటయ్య, డీఆర్‌డీవో గణేశ్, వనపర్తి ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, శ్రీరాములు, అన్ని మండలాల ఎమ్మార్వోలు, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు, వీఆర్‌వో, వీఆర్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ ఆటపాట
మదనాపురం : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాలు, తండాల నుంచి మహిళలు బతుకమ్మలను ప్రత్యేకంగా అలంకరించుకుని మదనాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని, అక్కడి నుంచి ఊరేగింపుగా వ్యవసాయ మార్కె ట్ యార్డుకు తరలివెళ్లారు. అనంతరం బతకమ్మలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ఆట పాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లో కనాథ్‌రెడ్డి, ఎంపీపీ పద్మావతి, తాసిల్దార్ సింధూ జ, సీఐ సీతయ్య, ఎస్సై సైదయ్య, జెడ్పీటీసీ కృ ష్ణయ్య, వైస్ ఎంపీపీ యాదమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ నారాయణ, ఎంపీడీవో నాగరాజు, కురుమూర్తి పాలక మండలి సభ్యులు గోపిస్వామి, రై.స.స మండల కో-ఆర్డినేటర్ హనుమాన్‌రావు, టీఆర్‌ఎస్ మండల ప్ర ధాన కార్యదర్శి వడ్డెరాములు, ఏపీఎం తిరుపతి రెడ్డి, మహిళా సంఘం మండలాధ్యక్షురాలు అ ర్చన, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బతుకునిచ్చే పండుగ బతుకమ్మ
ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరికీ బతుకునిచ్చే పండుగ బతుకమ్మ అని రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరితరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు పట్టణం లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబురాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కులమతాలకతీతంగా బతుకమ్మ సంబురాలు చేసుకోవాలన్నారు. ఎంపీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ గౌరమ్మను పూజించుకొని దసరా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ అని అన్నా రు. ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యద ర్శి శ్రీనివాసులు దంపతులు సుచరితరెడ్డి, ఎంపీ పీ, పీఏసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, వైస్ ఎంపీ పీ కోటేశ్వర్‌లను సన్మానించారు. మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. జూరాల ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థుల నృత్యం అలరించింది. అలాగే అమరచింత మండలకేంద్రంలో జరిగిన వేడుకల్లో చిట్టెం సుచరితరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు రవికుమార్‌యాదవ్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, అనిల్‌గౌడ్, వీరేశలింగం, సిరాజ్‌అహ్మద్ తదితరులున్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...