విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు


Sun,October 6, 2019 02:02 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు గురుకులాల నాన్ టీచింగ్ సిబ్బందికి సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి నిర్వహించిన మూడు రోజుల శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. భగీరథ కాలనీ బాలికల గురుకుల పాఠశాలల మూడు రోజులుగా నాన్ టీచింగ్ సిబ్బందికి విధి నిర్వహణలో అలసత్వం వీడి, నిబద్ధతతో పని చేయాలన్నారు. సమస్యలను గుర్తించి వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే సమాచారం అందజేయాలన్నారు. క్రమశిక్షణ లేకుం డా పని చేస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలన్నారు. సెలవులో ఏమైనా పనులు ఉంటే పూర్తి చేసుకోవాలన్నారు. సిబ్బంది విధి నిర్వహణపై ప్రతి రోజూ పర్వవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ బీ శ్రీనివాసులు, డీఎల్‌సీ గూలం హుస్సేన్, జామీర్‌ఖాన్, ప్రిన్సిపాల్స్ జాఫర్, సాదత్‌జహ, ఫరీదజాబిన్ పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...