స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి


Sun,October 6, 2019 02:02 AM

-ఎంపీపీ కృష్ణనాయక్
ఖిల్లాఘణపురం : గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని ఎంపీపీ కృష్ణనాయక్ అన్నారు. శనివారం మండలంలోని వెనకితండాలో గిరిజనులకు ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంఈవో ఉషారాణిలతో కలిసి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి చెందాలంటే అందరు ఐక్యతగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని అన్నారు. స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వీధులలో ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయకుండా చెత్త బుట్టలలోనే వేసి గ్రామ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని, అట్టి చెత్తను గ్రామ డంపింగ్‌యార్డ్‌కు తరలించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి విద్యార్థిని చదువుపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్‌ను నివారించి పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, నాయకులు క్యామరాజు, గోపాల్‌నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...