గ్రామ పంచాయతీ కార్మికులకు నూతన దుస్తులు పంపిణీ


Sun,October 6, 2019 02:01 AM

ఖిల్లాఘణపురం : మండలంలోని కమాలుద్దీన్‌పూర్ గ్రామ పంచాయతీలో కార్మికులుగా పనిచేస్తున్న సిబ్బందికి సర్పంచ్ ఉమాలకా్ష్మరెడ్డి దసరా కానుకగా నూతన వస్ర్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రజ లు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా దసరా పండుగను జరుపుకోవాలని అన్నారు. గ్రామానికి నిరంతరం సేవలు అందిస్తున్న సిబ్బందికి తమ వంతు సహాయంగా నూతన వస్త్రాలు కానుకగా అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...