మంత్రి సహకారంతో జర్నలిస్ట్‌లను ఆదుకుంటాం


Sun,October 6, 2019 02:01 AM

పెద్దమందడి : మంత్రి నిరంజన్‌రెడ్డి సహకారంతో జర్నలిస్ట్‌లను అన్నివిధాల ఆదుకుంటామని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు మధుగౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఇటీవల విలేకరి బాలస్వామి మృతి చెం దిన సందర్భంగా సంస్మరణ సభను పెద్దమందడి ప్రెస్‌క్లబ్ లో కొండన్నయాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎంపీపీ మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలస్వామి రెండు నెలల కిందట మృ తిచెందడం పట్ల ప్రభుత్వం నుంచి రూ.లక్ష మంజూరు చేయిస్తామని అన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి కూడా బాలస్వామి కుటుంబాన్ని అన్నివిధాల సహకరిస్తానని హామీ ఇ చ్చారని చెప్పారు. మంత్రి వద్ద నుంచి దాదాపు రూ.3.5లక్షలకు పైగా ఎల్‌వోసీ ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నా రు. మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రాజప్రకాశ్‌రెడ్డి, తాసిల్దార్ ఘాన్షీరాం, సర్పంచులు, ఎంపీటీసీలు, విలేకర్లు ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...