చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలి


Sun,October 6, 2019 02:01 AM

పాన్‌గల్ : పెండింగ్‌లో ఉన్న కాల్వలను త్వరితగతిన పూర్తి చేసి ప్రతి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేలా చ ర్యలు చేపట్టాలని జె డ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే బీ రం హర్షవర్ధన్‌రెడ్డి అ ధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని మాధవరావుపల్లి, దావత్కాన్‌పల్లి గ్రామాలకు వెళ్లే ఎంజీకేఎల్‌ఐ డీ-8 కాలువ పనులను నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం రేకులపల్లి తం డాలో పరిశీలించారు. పాన్‌గల్ మండలంలోని దావత్కాన్‌పల్లి, ఆకులోనిపల్లి గ్రామాలకు సాగునీరు వెళ్లడంలేదని అక్క డే ఉన్న రైతులు జె డ్పీచైర్మన్, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వీలైనంత త్వరలో పెండింగ్ కాల్వల పనులు పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. యాసంగి సీజన్‌లో పంటలు వేసుకున్న రైతులకు సాగునీటి విషయంలో ఎ లాంటి ఢోకా లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మిచంద్రశేఖర్, టీఆర్‌ఎస్ మండల నాయకులు వెంకటయ్యనాయుడు, రా ములు యాదవ్, బాలరాజుగౌడ్, నవీన్‌రెడ్డి, భా స్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...