అన్నదానం కంటే రక్తదానం గొప్పది..


Sat,October 5, 2019 04:05 AM

వనపర్తి వైద్యం : సమాజంలో అన్నదానం కంటే రక్తదానం ఎంతో గొప్పదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి జన్మదినం సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం, అలాగే మహబూబ్‌నగర్ ఎస్‌వీఎస్ వైద్యుల ఆధ్వర్యంలో మంత్రి కుమారై ప్రత్యూష చేతుల మీదుగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత వైద్యశిబిరంలో 500 మందికి సేవలను అందించారు. 120 మం ది రక్తదానం చేసి తమ ఉనికిని చాటుకున్నారు. అదేవిధంగా గాంధీచౌక్ అర్బన్ హెల్త్ సెంటర్లో జిల్లా జడ్జి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా మంత్రి జిల్లా కేంద్రంలోని చింతల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రక్తదా న శిబిరానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అభిలాష్, జెడ్పీటీసీలు బోర్ల భీ మయ్య, డాక్టర్లు ఊర్మిళ, పుష్పలత, అరుణ్, మ ద్దిలేటి, సూర్యకాంత్, మహేశ్, డీపీహెచ్‌వో రవిశంకర్, జూనియ ర్ సివిల్ జడ్జి ఇందిర, న్యాయవాదులు రామచంద్రా రెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు రమేశ్, కృష్ణ, టీఆర్‌ఎస్ నాయకులు బీచుపల్లి యాదవ్, యాదగిరి, కిట్టు, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ ఖాజా కుతుబుద్దీన్, అమర్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...