ఘనంగా మంత్రి నిరంజన్‌రెడ్డి జన్మదిన వేడుకలు


Sat,October 5, 2019 04:04 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి నిరంజన్‌రెడ్డిని వనప ర్తి, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌గనర్ జెడ్పీ చైర్మన్లు లోకనాథ్‌రెడ్డి, సరిత తిరుపతయ్య, స్వర్ణ సుధాకర్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, ఉమ్మడి జిల్లా మాజీ జె డ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు, ప్రజలు, అధికారులు, విలేకరులు ఆయన నివాస గృహంలో వేర్వేరుగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి మీ ద ఉన్న అభిమానంతో అభిమానులు భారీ పూలదండ ను తీసుకురాగా, క్రేన్ సాయంతో అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వేశారు. జిల్లా కేంద్రంలోని వేద పండితులు మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రూపొందించిన జయహో నిరంజనుడా గీతాన్ని, భాగ్యనగర్ పోస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మాల్యాల వీరరాఘవరెడ్డి రూపొందించిన జన్మదిన ప్ర త్యేక సంచికను మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. అలాగే మంత్రి కుమార్తె డాక్టర్ ప్రత్యూష జిల్లా కేంద్రంలోని 26వ వార్డులో అమ్మవారి విగ్రహం వద్ద చండీహోమం, అన్నదానం చేశారు. అనంతరం 200 మంది ఆడపడుచులకు వన్‌గ్రాం గోల్డ్ కాయిన్‌లను అందజేశారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...