నిర్ధ్దారణ తరువాతనే రిపోర్టు ఇవ్వాలి


Sat,October 5, 2019 04:04 AM

-సమీక్షలో జిల్లా ప్రజారోగ్య అధికారి డాక్టర్ రవిశంకర్
వనపర్తి వైద్యం : వ్యాధి నిర్ధ్దారణ చేసిన తరువాతనే రిపోర్టు ఇవ్వాలని జిల్లా ప్రజారోగ్య అధికారి డాక్టర్ రవిశంకర్ తెలిపారు. అన్ని రకాల ల్యాబ్ టెస్టులపై శుక్రవారం జిల్లా దవాఖానలో పీహెచ్‌సీ ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ మలేరియా వ్యాధి నిర్ధారణ కోసం గ్లాస్ ైస్లెడుపై రక్తం చుక్కలను వేసి సూక్ష్మదర్శిని ద్వారా చూస్తే మలేరియాకు సంబంధించిన వ్యాధి కణాలను గుర్తించవచ్చని తెలిపారు. సూక్ష్మదర్శిని ద్వారా తెమడ, మూత్రపరీక్ష చేయవచ్చన్నారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇస్మాయిల్, డాక్టర్ అయూబ్‌ఖాన్, శ్రీనివాస్ జీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...