డ్యూటీ ఆఫీసర్లకు ఒక రోజు శిక్షణ


Sat,October 5, 2019 04:04 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : డ్యూటీ ఆఫీసర్ రోల్ వర్టికల్‌లో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలోని డ్యూటీ ఆఫీసర్లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డ్యూటీ ఆఫీసర్ వర్టికల్ జిల్లా ఇన్‌చార్జి, పట్టణ సీఐ సూర్యనాయక్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మే రకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్యనాయక్ మాట్లాడుతూ ప్రతి రోజు విధులకు హాజరయ్యే సిబ్బందికి క్రమం తప్పకుండా రోల్‌కాల్ నిర్వహిస్తూ, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పనుల ప్రాధ్యానతను దృష్టిలో ఉంచుకుని పరిమిత వనరులతో గరిష్ట ప్రయోజనాలతో పొందేలా విధులను కేటాయించాలన్నారు. విధుల పట్ల సమిష్టితత్వం, నిబద్దత పెంపొందేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీ సెల్ ఎస్‌ఐ జగన్, ఐటీ కోర్ సిబ్బంది మురళి, విజయ్, డ్యూటీ ఆఫీసర్లు ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...