క్రీడలతో మానసికోల్లాసం..


Sat,October 5, 2019 04:04 AM

గోపాల్‌పేట : క్రీడల వల్ల శరీర దారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని జెడ్పీ చైర్మన్ రాకాసి లోకనాథ్‌రెడ్డి తెలిపారు. దసరా సందర్భంగా మండలకేంద్రంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ ఆటల పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వారం పాటు నిర్వహించనున్న క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి 40 జట్లు వచ్చాయన్నారు. నిర్వాహకులు మల్లిఖార్జున్, ఈశ్వరయ్యలను అభినందించారు. గ్రామ స్థాయి క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మంచి స్నేహపూర్వక వాతావరణంలో క్రికెట్ పోటీలు జరిగేందుకు నిర్వాహకులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భార్గవి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, ఉప సర్పంచ్ శివ, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ తిరుపతి యాదవ్, కో ఆప్షన్ సభ్యులు మతీన్, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు వెంకటస్వామి, నాయకులు కోదండం, బాల్‌రాజు, మణ్యెంనాయక్, గోపాల్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...