మత్స్యకారుల అభ్యున్నతికి కృషి


Sat,October 5, 2019 04:03 AM

-శాఖాపూర్ చెరువులో చేపపిల్లలను వదిలిన జెడ్పీ చైర్మన్
పెబ్బేరు రూరల్ : మత్స్యకార కుటుంబాల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నదని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామంలోని కొత్త చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా లోకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా కేసీఆర్ సర్కార్ ఉచితంగా చేప పిల్లలను వదులుతూ మత్స్య సంపద అభివృద్ధికి చేయూతనిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ముప్పై రోజుల ప్రణాళికా పనులను పరిశీలించారు. రోడ్డుకిరువైపులా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, వైస్ ఎంపీపీ బాలచంద్రారెడ్డి, సర్పంచ్ రవికుమార్, సామాజికవేత్త సత్యంసాగర్, మత్స్యకార సంఘం నాయకులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...