జిల్లాలో భారీ వర్షం


Fri,October 4, 2019 02:28 AM

-అత్యధికంగా ఘణపురంలో 63.8 మి.మీ
-అత్యల్పంగా పాన్‌గల్‌లో 0.5మి.మీ
-ఉప్పొంగిన వాలాద్రివాగు, పిల్లివాగు
-నిండుకుండల్లా కుంటలు, చెరువులు

వనపర్తి క్రీడలు : జిల్లాలో ఆయా మండలాలలో గురువారం అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. జిల్లాలో 14 మండలాల్లోని వర్షపాతం వివరాలు .. ఖిల్లాఘణపురం 63.8 మి.మీ., చిన్నంబావి మండలం పెద్దదగడ 50.3 మి.మీ., వెల్గొండ 30.8 మి.మీ., గోపాల్‌పేట 48.8 మి.మీ., మదనాపురం 48.3 మి.మీ., పాన్‌గల్ మండల కేంద్రంలో 0.5 మి.మీ., రేముద్దులలో 41.3 మి.మీ., కత్తేపల్లి 14.0 మి.మీ., రేవల్లి మండలంలో 28.5 మి.మీ., ఘణపురం సోలీపూర్ 24.8 మి.మీ., వీపనగండ్ల 24.3 మి.మీ., శ్రీరంగాపురం 24.0 మి.మీ., పెద్దమందడి 13.8 మి.మీ., కొత్తకోట మండలం కానాయిపలిల్లో 13.0 మి.మీ., విలియం కొండ, మిరాసిపల్లి 5.0 మి.మీ., పెబ్బేర్ 11.0 మి.మీ., వనపర్తి 8.8 మి.మీ., ఆత్మకూర్ 1.5 మి.మీ., అమరచింత 0.8 మి.మీ. మేరకు వర్షపాతం నమోదైంది.

ఖిల్లాలో 4 సెంటి మీటర్లు..
ఖిల్లాఘణపురం : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కుంటలు, చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. గంటకుపైగా వర్షం కురవడంతో 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏఎస్‌వో రాణి తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రంలోని పిల్లివాగు, వాలాద్రివాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. రోడ్డు పైకి వర్షపు నీరు చేరడంతో కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంతటి భారీ వర్షాలు ఎప్పుడు చూడలేదని, దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు చూస్తున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా కాలువల ద్వారా నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

పెబ్బేరులో భారీ వర్షం
పెబ్బేరు రూరల్ : పెబ్బేరు మండలంలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి ముసురు వర్షంతో ఉదయం 7గంటల సమయంలో కుండపోత వర్షం కురిసింది. వర్షం కారణంగా గ్రామాల్లోని వీధులన్నీ జలమయమయ్యాయి. వరికి ఎలాంటి నష్టం లేదని, వేరుశనగ పంటకు మాత్రం కొంత ముప్పు ఉంటుందని రైతులు తెలిపారు. మండలంలో 8.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.

రేవల్లి మండలంలో..
రేవల్లి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లాయి. బుధవారం అర్ధరాత్రి కుండపోత వానకురిసింది. ఇటీవల రైతులు వేరుశనగ విత్తనాలు వేసుకున్నారు. కలుపు నివారణకు రైతులు కలుపుమందును పిచికారి చేసుకున్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...