ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి


Fri,October 4, 2019 02:26 AM

వనపర్తి విద్యావిభాగం : ఈనెల 5 నుంచి కొనసాగనున్న ఆర్టీసీ సమ్మెతో ముందస్తు చర్యగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఆర్టీవో నాయక్ తెలిపారు. 10వ తరగతి పాసైన నిరుద్యోగ యువతీ యువకులు డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీవో పేర్కొన్నారు. ఒరిజినల్ ధ్రువపత్రాలతో వనపర్తి ఆర్టీసీ డిపో వద్ద రావాలని ఆయన సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 25 ఏళ్లు పైబడిన వారు హాజరుకావాలని, ప్రైవేట్ (అద్దె బస్సులు), పాఠశాలల బస్సులు కూడా నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చామని ఆయన చెప్పారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారికి చెప్పామన్నారు. ఆర్టీసీ అధికారుల చర్చలు విఫలమైతేనే ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీవో వివరించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...