నూతన పోలీస్ అభ్యర్థులకు, శిక్షకులకు సన్మానం


Fri,October 4, 2019 02:26 AM

వనపర్తి క్రీడలు : కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థాయికి చేరాలని క్రియేటివ్ ఫౌండేషన్ అధినేత మధుకర్‌స్వామి అన్నారు. గురువారం పట్టణంలోని వల్లబ్‌నగర్ రేడియంట్ హైస్కూల్‌లో ఆ సంస్థ సభ్యులు భాస్కర్, ఎండీ గౌస్, రాజగౌడ్‌ల ఆధ్వర్యంలో సక్సెస్ సమావేశం నిర్వహించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందిన వారిలో 50మంది పోలీస్ శాఖ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. నూతనంగా ఎంపికైన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులతో పాటు మండలంలోని పెద్దగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ గాయకుడు కొండన్నను శాలువా పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో భాగ్యనగర్ ఇనిస్టిట్యూట్ అధినేత కిరణ్, రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సీఐ సత్యనారాయణ, కరస్పాండెంట్ కౌసల్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...