అస్వస్థతతో కాడెద్దు మృతి


Fri,October 4, 2019 02:26 AM

అయిజ రూరల్ : వ్యవసాయ పనులు చేస్తుండగా కాడెద్దు అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సంకాపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వీరభద్రుడు తన పొలంలో అంతర సేద్యం చేస్తుండగా కాడెద్దు అస్వస్థతకు గురైంది. ఇది గమనించిన రైతు సమీపంలోని పశువుల పాక వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తుండగా ఎద్దు మృతి చెందింది. దీంతో రైతు కుటుంబం శోకసంద్రంలో మునిగింది. బాధిత రైతు వారం రోజుల కిందట కాడెద్దులను రూ.లక్షా పదివేల వెచ్చించి కొనుగోలు చేశాడు. బాధితున్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేసి రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...