ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలి


Fri,October 4, 2019 02:26 AM

వనపర్తి సాంస్కృతికం : తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతికానికి పునర్జీవనం పోసింది బతుకమ్మ పండుగ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పంచాయితీ రాజ్ శాఖ, జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదో రోజు అలిగిన బతుకమ్మ సంబురాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మలకు పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాంస్కృతిక కళలలకు బతుకమ్మ పండుగ పునర్జీవనం పొసిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్లాస్టిక్ రహితంగా మార్చుకుని, ప్రజలు నివసించే ప్రాంతాల్లో క్రిమి కీటకాలు, దోమలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి మళ్లీ వచ్చే సంవత్సరం బతుకమ్మ పండుగలు అద్భుతంగా చేసుకోవాలంటే, పారిశుధ్య పరిరక్షణ ఎంతో అవసరమని మంత్రి కొనియాడారు. 3 అక్టోబర్ 2013 న కేంద్ర క్యాబినేట్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తీర్మానం చేస్తు, రిజర్వేషన్ చేసిన దినం అని మంత్రి అన్నారు. ఆ నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదిస్తు కేంద్ర క్యాబినేట్‌లో తీర్మానం చేయాలని నిర్ణయించుకుందన్నారు .

సీడబ్ల్యూసీ చేసిన వెంటనే కేంద్ర క్యాబినేట్ కూడా తీర్మానం చేసిన దినం అని, కేంద్ర క్యాబినేట్ తర్వాతనే చట్టా రూపం దాల్చి పార్ల మెంట్‌లో చట్టం వచ్చి 2014ఫిబ్రవరి 20 తేదీన చట్టం అయిపోయిందని, రాష్ట్ర విభజన ఆమోదం అయిందన్నారు. అందుకు విజయదశమికి బతుకమ్మ సంబురాలకు, రాష్ట్ర ఏర్పాటుకు మంచి దినంగా ముడిపడి ఉందన్నారు. జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతున్న ప్రకృతి సిద్ధమైన ది బతుకమ్మ పండుగ అని అన్నారు. వివిధ పూలతో అలంకరించిన బతుకమ్మకు పూజలు చేశారు. తెలంగాణలో మహిళలకు ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ అని, ఈ పండుగ తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీక అని కూడా చెప్పవచ్చన్నారు. ఈ కాలంలో పూలు బాగా పూస్తాయని, అలాగే జలవనరులు కూడా చాలా సంమృద్ధ్దిగా ఉండే వాతావరణంలో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, డీఆర్‌డీఏ గణేష్, జడ్పీ సీఈవో నర్సింహులు , జడ్పీటీసీలు సామ్య నాయక్, భార్గవి, మార్కెటింగ్ అదికారి స్వర్ణ సింగ్, డీపీఓ రాజేశ్వరి, ఉస్మాన్, తెలంగాణ జాగృతి జిల్లా సభ్యులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...